Tuesday, February 1, 2011

దిల్ రాజు కండీషన్స్ కి పరారైన మహేష్ హీరోయిన్

మహేష్ సరసన అతిధి చిత్రంలో చేసిన అమృతారావు గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె రీసెంట్ గా దిల్ రాజు తాజా చిత్రం ఓహ్ మై ప్రెండ్ లో హీరోయిన్ గా ఓకే అయింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దానికి కారణం మరేదో కాదు..ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన రూల్స్. నిర్మాతల మండలి పెట్టిన రూల్స్ ప్రకారం దిల్ రాజు ఆమెకు కాస్ట్ కట్టింగ్ విషయాలను దృష్టిలో పెట్టుకుని కండీషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ప్రకారం ఫైవ్ స్టార్ హోటల్ ఉండదు. ఇతర లక్సరీస్ ఏమీ ఉండవు. ఇవన్నీ విన్న ఆమె తాను తెలుగులో చేయాలని ఆత్రుతపడటం లేదని,తప్పుకుంటానని స్పష్టం చేసింది.

దాంతో దిల్ రాజు మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టారు. ఇక కరీంనగర్ కి చెందిన వేణు శ్రీరామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల,వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సిద్దార్ధ హీరోగా చేయనున్నాడు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...