Tuesday, February 1, 2011

టాలీవుడ్ కెప్టెన్‌గా విక్టరీ వెంకటేష్, కోలీవుడ్ కెప్టెన్‌గా సూర్య

విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ లేని సమయాల్లో ఏ దేశంలో క్రికెట్ జరిగినా అక్కడ వాలిపోతుంటారాయన. అలాగే విష్ణుకి కూడా క్రికెట్ అంటే మోజు. తాజాగా అందరి కళ్లూ త్వరలో జరగబోయే ‘సిసిఎల్’ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచ్‌లపైనే ఉన్నాయి. సినీ తారలు కలిసి ఆడనున్న ఈ మ్యాచ్‌లను తనివి తీరా వీక్షించడానికి ప్రేక్షకులు రెడీ అయిపోతున్నారు. మరోవైపు ఈ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి, కొనుగోలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి కనబరచడం విశేషం. ఈ ఆరోగ్యకరమైన పోటీలో టాలీవుడ్ టీమ్‌కి యజమానిగా వ్యవహరించే అవకాశాన్ని మంచు విష్ణు చేజిక్కించుకున్నారు. టాలీవుడ్ టీమ్‌కు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి కనబర్చిన తరుణంలో ‘వెంకటేష్’ ఆ బాధ్యతను స్వీకరిస్తున్నారని ‘టాలీవుడ్ టీమ్ ఓనర్’ విష్ణు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

హీరోలు క్రికెట్ ఆటలో సత్తా చూపడానికి రెడీ అవుతుంటే మరోవైపు హీరోయిన్లు ఆట మైదానంలో అందంగా ప్రత్యక్షమై ఆటగాళ్లను ‘చీర్ అప్’ చేయనున్నారు. ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా టాలీవుడ్ టీమ్‌కు అందాల తారలు తాప్సీ, సమంత ప్రచారకర్తలుగా ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా తమిళ టీమ్‌కు సూర్య కెప్టెన్‌గా.. అక్కడి నడిగర్ సంఘం (ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఓనర్‌గా వ్యవహరించడానికి తీర్మానం అయ్యాయి. కన్నడ టీమ్‌కు పునీత్ రాజ్‌కుమార్, హిందీకి కెప్టెన్ కమ్ ఓనర్‌గా సల్మాన్‌ఖాన్ వ్యహరించబోతున్నారు. ఆ కోరికతోనే టీమ్ ఓనర్‌గా వ్యవహరించడానికి ముందుకొచ్చారు. ఇక టాలీవుడ్ టీమ్‌లో ఏయే ఆర్టిస్టులు ఆడబోతున్నారనే విషయం త్వరలో తెలుస్తుంది. ‘‘ఫిబ్రవరి 14లోపు ఆటగాళ్లను నిర్ణయించి, టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తాం’’ అని విష్ణు తెలిపారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...