Tuesday, February 1, 2011

బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ ‘చురకత్తి’..

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందన్న విషయం తెలిసిందే. జూ ఎన్టీఆర్ బోయపాటి శీను చెప్పిన కథకు ఇన్స్ఫైర్ అయి శీను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జూ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కెయస్ రామారావు నిర్మాణ సారధ్యంలో త్వరలో రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం ప్రకారం జూ ఎన్టీఆర్ ‘గర్జన’ అనే టైటిల్ కాస్తా ‘చురకత్తి’గా రాబోతోంది. రీసెంట్ గా ఈ టైటిల్ ను ఫిల్మిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారని సమాచారం.

కాగా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ జూ ఎన్టీఆర్ సరసన నటించనుందని సమాచారం. సిద్దార్థ, శృతి హాసన్ నటించిన చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’ రీసెంట్ గా విడుదలై మహారాణి గా అద్భుతమైన నటన కనబరించిన విషయం తెలిసిందే. సో దర్శక, నిర్మాతలు ఈ సినిమా టైటిల్, టెక్నీషియన్స్, ఇతర పాత్రదారుల గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జూ ఎన్టీఆర్ ‘శక్తి’ షూటింగ్ పూర్తవగానే జూ ఎన్టీఆర్ చురకత్తి ఆరంభం కావచ్చని సమాచారం.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...